తీరిగ్గా తిందాము అనుకుని అది నేరుగా వెళ్ళి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది.
తినదామనుకునే సరికి అటుకేసి ఒక నక్క వచ్చింది.
కాకి దగ్గర మాంసం ముక్క ఉన్న విషయం తెలుసుకుంది.
దాన్ని ఎలా అయినా కాజేయాలని పదకం వేసింది.
"కాకి బావ, కాకి బావ నీ రెక్కలు ఎంత బాగుంటాయో" అంది.
"కాకి బావ, కాకి బావ నీ ఈకలు నల్లగా మెరిసిపోతున్నాయి సుమా" అంది.
"అవును కాకి బావ! నువ్వు చక్కగా పాడతావు అట కదా. గెద్ద బావ చెప్పిందిలే" అంది.
కాకి ఉలక లేదు పలక లేదు.
నక్క మళ్లీ మొదలు పెట్టింది దండకం.
"బావ బావ ఒకే ఒక్క పాట పాడవా? మంచి పాట వినక ఎన్ని సంవత్సరాలు అయిందో.
నువ్వు పాడితే ఇక్కడే హాయిగా వింటూ నిద్రపోతా.
నీకు పుణ్యముంటుంది పాడవా?"
కాకి ఇక నక్క చెప్పేవి వినలేక పాడదామనుకొని నోరు తెరచింది.
నోట్లోని మాంసం ముక్క చటుక్కున కింద పడింది.
కింద పొంచిఉన్న నక్క ఆ ముక్కని లటుక్కున పట్టుకొని పారిపోయింది.
కాకి బిత్తరపోయి అలాగే నక్కను చూస్తుంది.
నీతి: పొగడ్తలను వినవచ్చు కానీ విని తబ్బిబ్బి కాకూడదు.
No comments:
Post a Comment